Neevu lekapothe
నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా
నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా
నువు చేరదీయకపోతే నా మనసే చేదయ్యా
నువు నాకుంటే ఎన్నడు నేను ఒంటరి కానయ్య
నీ కృప నాకు తోడై వుంటే అంతే చాలయ్యా
యేసయ్యా…. యేసయ్యా….
1. సిరి సంపదలు కలిగిన వేళ – అందరూ హత్తుకు వుంటారు.
సంపదలన్ని తరిగిన వేళ కంటికి ఎవ్వరు కానరారు
ఎవరున్నా… ఆ …. లేకున్నా…. ఆ …….
ఏ స్థితిలో నేనున్న – నన్ను విడువని
నమ్మకస్థుడవు నీవె యేసయ్యా
||యేసయ్యా||
2. విరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు?
విరిగిన మనసును వాడుకునే నీతో ఎవ్వరు సరిరారు
దీనులను… హీనులను
జ్ఞానులుగా…. శ్రీమంతులుగా – మార్చగలిగిన
మంచి దేవుడవు నీవె యేసయ్యా