Neevegaaka veredhaivam lene ledhayya
నీవేగాక వేరేదైవం లేనే లేదయ్య
పల్లవి : నీవేగాక వేరేదైవం లేనే లేదయ్య
లేవే లేదయ్యా లేనే లేదు లేనే లేదు లేవే లేదయ్యా
భువి యందైన పరమందైనా నాకున్నా
ఒక్కాష నీవేనయా (2)
1. నన్ను ప్రేమించి నాకై మరణించి
తిరిగి లేచినట్టి జీవమిచ్చినట్టి
నీవంటి ప్రియుడేవరయ్య యేసయ్యా (2)
౹౹భువి౹౹
2. నాశ్రమలోనా శోధనలో
నన్ను సంరక్షించి నాకు నెమ్మదినిచ్చి
నీవంటి స్నేహితుడెవరయ్య యేసయ్యా (2)
౹౹భువి౹౹
3. నా వ్యాధుల్లో – నా బాధల్లో
నాకు స్వస్థత నిచ్చి – నాకు విడుదలనిచ్చి
నీ వంటి వైద్యుడెవరయ్య యేసయ్యా
నీ వంటి వైద్యుడెవరయ్య యేసయ్యా