Neethone Anubhandham

నీతోనే అనుబంధం

నీతోనే అనుబంధం – నీలోనే ఆనందం
నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా – కావాలి నీ స్నేహము
ఎవరున్నా లేకున్నా ఏమైన కాకున్న నీతోనే నా పయనము
నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా – కావాలి నీ స్నేహము

1. నా కాల గతులన్ని నీ వశమని
నిలిచి వున్నాను నీ చెంతనే
నా దాగు చోటువు నీవేనని
నమ్మిక యుంచాను నీ మీదనే
అవునన్నా కాదన్న వెలుగైనా వెతలైనా నీతోనే నా పయనము

॥నీ ప్రేమ||

2. నా ఊపిరయ్యింది నీ శ్వాసనీ
నిత్యము నీకెపుడు నా ధ్యాసనీ
నీ ప్రాణమిచ్చింది నా కొరకనీ
నీలాంటి ప్రేమికుడు ఇలలేడనీ
చావైనా బ్రతుకైనా మేలైనా కీడైనా నీతోనే నా పయనము

॥నీ ప్రేమ||