Neekanna Yevaru Unnarayya
నీకన్నా ఎవరు ఉన్నారయ్యా లోకంలో
నీకన్నా- ఎవరు ఉన్నారయ్యా లోకంలో
నాకన్నీనీవే నా- యేసయ్య (2)
నా తల్లి నీవేనయ్యా – నా తండ్రి నీవేనయ్యా (2)
మంచి స్నేహితుడైన నీవే – యేసయ్యా
నిజ బంధువుడైన నీవే – యేసయ్యా (2)
|| నీకన్నా ॥
పాపమందు నేను – పడిపోయి ఉన్న వేళ
లేవనెత్తినవు – కృప చూపినావు దేవా (2)
నా పాపము తొలగుటకొరకై రక్తం కార్చితివి
నన్ను శుద్ధిని చేయుట కొరకై సిలువ సహించితివి (2)
|| నా తల్లి నీవేనయ్యా ॥
ఆకలైన వేళ – ఆహారమిచ్చినావు
దాహమైన వేళ – జీవజలములిచ్చినావు (2)
నా శాపము తొలగించుటకై సమాధి చేరితివి
నన్ను మహిమకు మార్చుటకొరకై మరణం గెలిచితివి (2)
|| నా తల్లి నీవేనయ్యా ॥
వ్యాది యందు నేను – పడి కృంగియున్నవేళ
పరము నుండి నాకై – దిగి వచ్చినావు దేవా (2)
నీ గాయములందు ఉన్న స్వస్థత నిచ్చితివి
నీ రెక్కల క్రింద నన్ను నిత్యము దాచితివి (2)