Nee Sevalo Nannu

నీ సేవలో నన్ను కరిగిపోని

నీ సేవలో నన్ను కరిగిపోని
నీ ప్రేమలో నన్ను ఒదిగిపోని
నీ సిలువ నీడలో నా బ్రతుకు సాగని
నీ కొరకె నా జీవం అంకిత మవని
యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా

॥ నీ సేవలో॥

1. మోడైన నా బ్రతుకు చిగురింపజేసితివి
జీవ జలములతో నా దాహం తీర్చితివి
మరువలేనయ్యా నీ ప్రేమను
విడువను యేసయ్యా నీ పాదమును
యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా

॥ నీ సేవలో॥

2. నా దుఃఖమును సంతోషముగా మార్చితివి
నలిగిన మనసును నీవే బలపరచితివి
ఎన్నికలేని నన్ను ఎన్నుకునీ
ఎన్నో కార్యములు చేయుచుంటివి
యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా

॥ నీ సేవలో॥