Nee Premanu Nenu Vadhili
నీ ప్రేమను నేను వదిలి వెళ్ళునప్పుడు
నీ ప్రేమను నేను వదిలి వెళ్ళునప్పుడు
బ్రతుకగలనా – ఒక క్షణమైన (2)
బ్రతుక లేనయా ఒక క్షణమైనా..
నీవే నా కాపరి – నీవే నా ఊపిరి (2)
నీవే నా ఊపిరి (2)
||నీ ప్రేమను||
1. ఆకాను నిన్ను వదిలిపోయినా
ధనము వస్త్రములను పొందినా (2)
ధనమును ప్రేమించిన అతడు
పొందలేదే మనశ్శాంతిని (2)
పొందలేదే నీ ప్రేమను (2)
||నీ ప్రేమను||
2. యెహోషాపాతు నిన్ను వదిలిపోయినా
ఇహలోక స్నేహబును కోరినా (2)
ఇహమును ప్రేమించిన అతడు పొందలేదే మనశ్శాంతిని (2)
పొందలేదే నీ ప్రేమను (2)
||నీ ప్రేమను||
3. ఇహలోక సౌఖ్యములు వరియించినా
ఐశ్వర్యం బహుగా సమకూడినా (2)
నీ ప్రేమ ఎదుటనే వాటిని
ఎంచుకొందునే బహు వ్యర్థముగా (2)
వేచియుందునే పరవాసమునకై (2)