Nee mandhiramai Nenudaga
నీ మందిరమై నేనుండగా
నీ మందిరమై నేనుండగా – నాయందుండి నడిపించవా
నీవు తోడుండగా మాకు దిగులుండునా (2)
వెంబడిస్తాము నిను యేసువా(2)
1. నీవు కోరేటి దేవాలయం – మాదు దేహంబెగా నిశ్చయం
నీ ప్రత్యక్షతా మాకు కలిగించవా(2)
మా హృదయంబు వెలిగించవా(2)
||నీ మందిరమై||
2. హన్న ప్రార్ధనలు విన్నావుగా – నేనున్నానని అన్నావుగా
నాడు సమూయేలుతో బహుగ మాట్లాడిన(2)
దేవమందిరమిదె మాట్లాడవా(2)
||నీ మందిరమై||
3. ఆత్మ సత్యముతో ఆరాధింప
ఆత్మ దేవుండా నేర్పించుమా
సత్యమార్గంబులో మమ్ము నడిపించవా(2)
నిత్యము నిన్ను స్తుతియింతుము(2)
||నీ మందిరమై||
4. నాడు నిర్మించె దేవాలయం
రాజు సొలొమోను బహుసుందరం
అట్టి దేవాలయము మేము నిర్మించగా(2)
నీ కట్టడలో మమ నిలుపవా(2)
||నీ మందిరమై||
5. ఆ పరలోక ప్రతిబింబమై – ఈ ధరలోన దేదీప్యమై
ధరణి వెలిగించిన కరుణ ప్రసరింపను(2)
కరము తోడుంచి నడిపించుము(2)