Nee krupa Lenicho

నీకృప లేనిచో ఒక క్షణమైననూ

నీకృప లేనిచో ఒక క్షణమైననూ
నే నిలువజాలనో ప్రభు (2)
ప్రతి క్షణం కనుపాపలా
నను కాయుచున్న దేవుడా (2)

||నీ కృప||

ఈ ఊపిరి నీదేనయ్యా
నీవిచ్చిన దానం నాకై
నా ఆశ నీవేనయ్యా
నాజీవితమంతా నీకై (2)
నిను నేమరతునా మరువనో ప్రభు
నిను నే విడతునా విడువనో ప్రభు (2)

||నీ కృప||

నా ఐశ్వర్యమంతా నీవే
ఉంచినావు నీదయ నాపై
నీ దయ లేనిచో నాపై
ఉందునా ఈ క్షణమునకై (2)
కాచి ఉంచినావయ్యా – ఇంత వరకు
నను వీడిపోదయ్యా – నాకున్న నీ కృప (2)

||నీ కృప||