Nee Krupa bhaahulyame

నీ కృప బాహుళ్యమే

నీ కృప బాహుళ్యమే – నీ ప్రేమ పరవశమే
నా యేసయ్యా నీతో నా జీవితం
నిత్యము సంతోషమే – నిత్యము ఆనందమే

1. అగాధ జలములు ఆర్పగలేని
ప్రేమ జ్వాలను రగిలించినది
సంపూర్ణమైన సీయోనులో నన్ను
చేరరమ్మని పిలిచినది

॥నీ కృప బాహుళ్యమే||

2. అసాధ్యమైన కార్యములెన్నో
ప్రార్ధించగనే సాథ్యము చేసినది
అనుదినము నూతన వాత్సల్యమును చూపి
అంతకంతకు హెచ్చించినది

॥నీ కృప బాహుళ్యమే||

3. లెక్కించలేని నా దోషములు
నిండు ప్రేమతో క్షమియించినది
నా శాపమంత సిలువలో కడిగి
నన్ను నూతన పరచినది

॥నీ కృప బాహుళ్యమే||

ఆరాధన… ఆరాధన….
ఆరాధన… స్తుతి ఆరాధన…