Nee dukka dinamulu

నీ దుఃఖ దినములు సమాప్తమైయున్నవి

నీ దుఃఖ దినములు సమాప్తమైయున్నవి.
నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి యున్నవి.

ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా
ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా
యేసయ్య నిలిచాడు నీ తోడుగా

1. అలసిన నీ ఆశ ప్రభు తీర్చగా
చెదిరిన నీ మది సరి చెయ్యగా
లోకము శోకము నీలో తీసి
నూతన క్రియలను జరిగించునుగా

॥ఇన్నాళ్ళ||

2. నీపై నిందను తొలగించగా
తలగా నిన్ను నియమించగా
దూషణలన్నీ భూషణములుగా
హృదిలో చేదును మధురము చేయగా

॥ఇన్నాళ్ళ||

3. కలతల కడలిని దాటించగా
తరగని సమృద్ధి దయ చేయుగా
పరులకు సాయము చేయగ నిన్ను
పలు విధములుగా దీవించునుగా

॥ఇన్నాళ్ళ||