Nee Aasha Nirasha
నీ ఆశ నిరాశ కానేకాదు
నీ ఆశ నిరాశ కానేకాదు వేదన ఎందుకు
నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు
నమ్మునేస్తమా ఇది సత్యం
వీడబోకుమా విశ్వాసం
||ఆశ||
1. అవసరాన్ని బట్టి అగ్నివంటి శ్రమలు
కలుగుచున్నవని తెలిసీ కలత చెందబోకు
నిన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు
శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు
కంటిపాపలా తోడుండి నిను కాచుకుంటాడు
కన్నతండ్రిలా తోడుండి నిను ఆదుకుంటాడు
॥నమ్ము నేస్తమా|| నీ ఆశ॥
2. కాల్చ బడకపోతే స్వర్ణం విలువ పొందలేదు
చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు
దున్న బడకపోతే భూమి పంట నివ్వలేదు
చెక్కబడకపోతే శిల శిల్పం కాదు
శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపురాదు