Nannu Kaadanavani

నన్ను కాదనవని – నను కాదనలేవని

నన్ను కాదనవని – నను కాదనలేవని

నీ చెంతకు నే చేరినా (2)

నీ ప్రేమే చాలని – నిను ప్రేమించాలని

నీ మనసే నే కోరినా (2)

||నన్ను||

లోకాన్ని చూసి నే – పాపాన్ని చేసి నే

అలసి నీ చెంత చేరినా (2)

సాతానుకు దొరికిన – లోకానికి లొంగిన

నీవే నా దిక్కని ఎంచినా – (2)

||నన్ను||

లాభాన్నాశించి నే – లోపాలు చేసి నే

సొలసి నీ శరణు కోరినా (2)

శోధనలు లొంగిన – వంచనలకు ఒరిగిన

నీవే ఆధారమని యెంచినా – (2)

||నన్ను||