Nannu Balaparachuvaniyandhe
నన్ను బలపరచువానియందే
నన్ను బలపరచువానియందే
సమస్తము నే చేయగలను
నేను నమ్మిన వానిని ఎరుగుదును – సిగ్గుపడనెన్నడు.
1. పలు నిందలు నన్ను చుట్టినా – పరులంత గేలిచేసినా
పరిశుద్ధుని అడుగుజాడలో – నిత్యము నే నడిచెద
॥నేను॥
2. సింహాల గుహలోకైనా – సంతోషముగ వెళ్ళెదా
సిలువ మోయడానికైన – సిద్ధముగ నేనుండెద
॥నేను॥
3. దీనమైన స్థితిలోనైనా – సంపన్న స్థితిలోనైనా
ఏ స్థితిలో నేను వున్న – తృప్తిగా స్తుతియించుచున్న
॥నేను॥
4. అంధకారమావరించినా – ఆవేదన కృంగదీసినా
విశ్వాసము విడచిపెట్టక – ధైర్యముతో పోరాడెద