Nannaakarshinchina

నన్నాకర్షించిన నీ స్నేహ బంధం

నన్నాకర్షించిన నీ స్నేహ బంధం

ఆత్మీయ అనుబంధం (2)

ఆరాధన నీకే యేసయ్యా (2)

నా చేయిపట్టి నన్ను నడిపి

చేరదీసిన దేవా (2)

||నన్నాకర్షించిన||

మహా ఎండకు కాలిన అరణ్యములో

స్నేహించిన దేవుడవు నీవు (2)

సహాయకర్తగ తోడు నిలచి

తృప్తి పరచిన దేవా

సేదదీర్చిన ప్రభువా (2)

||నన్నాకర్షించిన||

చెడిన స్థితిలో లోకంలో పడియుండగా

ప్రేమించిన నాథుడవు నీవు (2)

సదాకాలము రక్షణ నిచ్చి

శక్తినిచ్చిన దేవా

జీవమిచ్చిన ప్రభువా (2)

||నన్నాకర్షించిన||