Nammadhagina Devuda
నమ్మదగిన దేవుడా నను నడిపించుమా
నమ్మదగిన దేవుడా నను నడిపించుమా
నమ్మకమైన నాయకుడా నను దరిజేర్చుమా
నీ ఆత్మతో నింపుమా నీ అభిషేకమీయుమా
ఆత్మీయపోరాటంలో నాకు జయమునీయుమా
||నమ్మదగిన||
1. నీవు చేరదీయకుంటే నిలిచేదెవరు
నీవు జాలిచూపకుంటే బ్రతికేదెవరు
నీవు ఊతమీయకుంటే అడుగేపడదు
నీవు నాకు తోడుంటే పయనమాగదు నా పయనమాగదు
||నమ్మదగిన||
2. కానాను యాత్రలోన నేను కదులుచున్నాను
నీ మేఘపు నీడలోన నేను నిలిచియున్నాను
సైన్యములకు అధిపతివై ముందు నడువుమా
వాగ్దాన దేశములోకి నన్ను చేర్చుమా