Nammadagina Devuda

నమ్మదగిన దేవుడా

నమ్మదగిన దేవుడా
నెమ్మదినిచ్చే యేసయ్యా (4)
నీవుంటే చాలయ్యా వేరేది వద్దయ్యా (2)
నీ తోడుంటే చాలయ్యా
భయమే నాకు లేదయ్యా (2)

||నీ తోడుంటే||

శ్రమ అయినా బాధ అయినా
కరువైనా ఖడ్గమైనా (2)

||నీ తోడుంటే||

కష్టమైనా కన్నీరైనా
కలతలైనా కలవరమైనా (2)

||నీ తోడుంటే||

సాగరాలే ఎదురు నిలిచినా
శత్రువులంతా నన్ను తరిమినా (2)

||నీ తోడుంటే||

భరువైనా భారమైనా
బాధ అయినా వేదనైనా (2)

||నీ తోడుంటే||

ఎవరున్నా లేకున్నా
కలిమి అయినా లేమి అయినా (2)

||నీ తోడుంటే||