Nadavaalani Yesu Nadavaalani

నడవాలని యేసు నడవాలని

నడవాలని యేసు నడవాలని

నడవాలని నీతో నడవాలని

నాకున్న ఆశ నీపైనే ధ్యాస (2)

నిరంతరం నీతోనే నడవాలని (2)

హానోకు నీతో నడిచాడు దేవ

పరలోకపు నడకతో చేరాడు నిన్ను

||నడవా||

నోవాహు నీతో నడిచాడు దేవ

రక్షణనే ఓడలో రక్షింప బడెను

||నడవా||

అబ్రాహాము నీతో నడిచాడు దేవ

విశ్వాసపు యాత్రలో సాగాడు నీతో

||నడవా||

నా జీవితమంతా నీతో నడవాలని

నా చేయి పట్టుకొని నడిపించు ప్రభువా

||నడవా||