Naathoduga Unnavadave

నాతోడుగా ఉన్నవాడవే నాచేయి పట్టి

నాతోడుగా ఉన్నవాడవే..! నాచేయి పట్టి
నడుపు వాడవే…!
యేసయ్యా…. యేసయ్యా…. యేసయ్యా….
యేసయ్యా….
కృతాజ్ఞత స్తుతులు నీకేనయ్యా …. (2)

||నాతోడు||

నా అనువారు నాకు దూరమైనా – నా తల్లి
తండ్రులే నాచేయి విడచినా
ఏక్షణమైనా నన్ను మరువకుండ
ఆ….ఆ……ఆ…. (2)
నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే…… (2)

||నాతోడు||

నాపాదములు జారిన వేళ – నీకృపతో నన్ను
ఆదుకొంటివే…..
నీ ఎడమచేయి నాతలక్రింద ఉంచి..
ఆ…..ఆ…..ఆ….. (2)
నీ కుడి చేతితో నన్నుహత్తు కొంటివే….. (2 )

||నాతోడు||

హృదయము పగిలి వేదనలోన – కన్నీరు
తుడచే పరిస్థితిలో….
ఒడిలో చేర్చి ఓదార్చువాడా….ఆ….ఆ…..ఆ…. (2)
కన్నీరు తుడచే నాకన్న తండ్రివే….. (2)

||నాతోడు||