Naatho Neevu Maatladinacho
నాతో నీవు మాటాడినచో నే బ్రతికెదను
నాతో నీవు మాటాడినచో నే బ్రతికెదను ప్రభు (2)
నా ప్రియుడా నా హితుడా – నా ప్రాణ నాథుడా నా రక్షకా… ఆ.. ఆ.. ఆ..
|| నాతో ||
1. తప్పిపోయినను తరలి తిరిగినను
దొద్దినుండి వేరై హద్దు మీరినాను
ఎరగనైతి మార్గం లేదు నాకు గమ్యం
ఆ ఒక్క మాట చాలు ప్రబో ఆ.. ఆ..
|| నాతో ||
2. చచ్చియుండి నేను చుట్టబడితి నేను
ప్రేత వస్త్రములతో బండరాతి మాటున్
కానలేదు నిన్ను కానరాదు గమ్యం
లేదు నీదు పలుకు నాకు బ్రతుకు నియాన్
ఒక్కమాట చాలు ప్రభో ఆ.. ఆ..
|| నాతో ||
3. యుద్ధమందు నేను మిద్దె మీద నుంచి – చూడరాని దృశ్యం కనుల గాంచినాను (2)
బుద్ధి మీరినాను హద్దు మీరినాను
లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం
ఒక్క మాట చాలు – ఒక్క మాట చాలు
ఒక్క మాట చాలు ప్రబో ఆ.. ఆ..
|| నాతో ||
4. కట్టబడితి నేను గట్టి త్రాళ్లతోను – వీడలేదు ఆత్మ వీడలేదు వ్రతము (2)
గ్రుడ్డి వాడనైతి గానుగీడ్చుచుంటి
దిక్కు లేక నేను దయను కోరుచుంటి
ఒక్క మాట చాలు – ఒక్క మాట చాలు
ఒక్క మాట చాలు ప్రబో ఆ.. ఆ..