Naalona Neevu Neelona Nenu

నాలోన నీవు నీలోన నేను

నాలోన నీవు నీలోన నేను (2)
కలిసుంటే అంతే చాలయ్య.. ( 4)
ఎవరేమి అనుకున్న ఎమున్నా లేకున్నా (2)
నీవుంటే అంతే చాలయ్య నా బ్రతుకులో ఏంతో మేలయ్య (2)

1.నే కోరలేదు ఈ లోక స్నేహం
ఆశించలేదే ఏ ఘనతలైన (2)
నీవుంటే చాలని నిన్ను చేరినానే (2)
నా సర్వము నీవే యేసయ్య సమస్తం నీలో యేసయ్య (2)

|| నాలోన నీవు||

2.శ్రమలైన నిందలైన శోధనలు వేదనలైనా
అవమానములెన్నైనా క్రుంగదీసినా కానీ (2)
సహనంతో నీ కొరకే భరియించెద యేసయ్య (2)
నా బలము నీవే యేసయ్య నా దైర్యం నీవే యేసయ్య (2)

|| నాలోన నీవు||

3.నన్ను కన్నవారు నను విడచినగాని
నమ్మినవారే నాకు దూరమైనా (2)
ఏనాడూ విడువని నా బంధం నీవే (2)
నా తల్లివి నీవే యేసయ్య.. నా తండ్రివి నీవే యేసయ్య.(2)

|| నాలోన నీవు||