Naa Swathyamaina
నా స్వాస్థ్యమైన పరలోకము
నా స్వాస్థ్యమైన పరలోకము ఎపుడు చేరెదనో (2)
సౌంధర్య సీయోనులో నా ప్రభువైన యేసయ్యను (2)
రారాజుగా నా కన్నులతో ఎప్పుడు చూచెదనో (2)
||నా స్వాస్థ్యమైన||
మహోన్నతుడా – తేజోనివాసి మహిమనంత విడిచి (2)
నా కోసమే దిగి వచ్చిన ప్రేమ సాగరా –
నా కోసమే పోరాడి చెరనుండి విడిపించినావా (2)
||నా స్వాస్థ్యమైన||
మహాఘనుడా మహిమా స్వరూపి – స్తుతి మహిమలు నీకే (2)
నా కాలు జారే చోటునుండి నీ తేజో మహిమ నిలిచే – సంఘములో నన్ను నిలిపిన నా మహిమైశ్వర్యమా (2)
||నా స్వాస్థ్యమైన||
మహనీయుడా మహానందమే కడవరి పిలుపులో (2)
ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్మనె ఆ పిలుపు కోసం – నే వేచి యుండెదను నీ కృప తోడుండగా (2)