Naa Sthothragaanama

నా స్తోత్రగానమా నా ప్రేమ రూపమా

నా స్తోత్రగానమా – నా ప్రేమ రూపమా
నా యేసు రాజా స్తోత్రము నీకే

1. నీ దివ్యనగరములో – సీయోను శిఖరములో
నన్ను నిలువబెట్టుటకు – ఆశ కలిగి యుంటివా
యోగ్యతే లేని నాకు నీ నీతి రాజ్యములోన
నిత్య యాజకత్వమును నియమించితివా

||నా స్త్రోత్రగానమా||

2. పరిశుద్ధుల బృందములో – పరమ తండ్రి సన్నిధిలో
నిత్యసేవ చేయుటకు – నన్ను ఎన్నుకొంటివా
విశ్వసింహాసన మందు ఆసీనుడవైన నీకు
స్తుతిధూపము నర్పించనను పిలిచితివా

||నా స్త్రోత్రగానమా||