Naa Parishudhudavu Neeve

నా పరిశుద్దుడవు నీవే

నా పరిశుద్దుడవు నీవే నా పరిపూర్ణుడవు నీవే
నా విమోచకుడనీవే – నా విజయానివి నీవే
నీకే స్తోత్రములు – నీకే స్తోత్రములు యేసయ్యా

1. నీ కృపలేక ఎవ్వరైన చేరలేరు పరలోకము
విడిపించెనే నను నీ రక్తము – నీ యందే నాకు అమరత్వము

॥నీకే స్తోత్రములు||

2. నీ యందు నిలిపిన నిరీక్షణ – సిగ్గుపరచదు నన్నెన్నడు
నడిపించునే నను నీ వాక్యము – పరిశుద్ధాత్ముని అభిషేకము

॥నీకే స్తోత్రములు||

3. నీ యందు పడిన ప్రయాసము – వ్యర్థముగా పోదెన్నడు
ఫలియింతును నీలో నిరతము – పరిపూర్ణతయే నా గమ్యము

॥నీకే స్తోత్రములు||