Naa Oohakandani Prematho

నా ఊహకందని ప్రేమతో

నా ఊహకందని ప్రేమతో నన్ను నీవు పిలిచావు
ఆ ప్రేమలోనే నన్ను నీలోనే నిలిపావు (2)
నాలోన నీవున్నావు – నీలోన నను దాచావు
నీ సాక్షిగా నను నిలిపావు (2)

||నా ఊహకందని||

అందరు నన్ను చూచి నీ బ్రతుకు మారదని
దూరాన నిలచి నన్ను చూచి నవ్వారే (2)
ఏనాడు అనుకోలేదు
నన్ను నీవు ఎన్నుకుంటావని (2)

||నా ఊహకందని||

జీవితమంతా శూన్యమైపోగా
నాకున్న వారే నన్ను విడచిపోగా (2)
ఏనాడు అనుకోలేదు
నాకు తోడుగా నీవుంటావని (2)

||నా ఊహకందని||

నా జీవితాన్ని నీవు మార్చినావు
నీ సేవలోనే నన్ను నిల్పినావు (2)
ఏనాడు అనుకోలేదు
నా జీవితం ఇలా మారుతుందని (2)

||నా ఊహకందని||