Naa Notan Krottha Paata

నా నోటన్ క్రొత్త పాట

నా నోటన్ క్రొత్త పాట
నా యేసు ఇచ్చెను (2)
ఆనందించెదను ఆయననే పాడెదన్
జీవిత కాలమంతా (2) హల్లెలూయా

|| నా నోటన్ ||

అంధకార పాపమంత నన్ను చుట్టగా
దేవుడే నా వెలుగై ఆదరించెను (2)

||ఆనందించెదను||

దొంగ ఊభి నుండి నన్ను లేవనెత్తెను
రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసెను (2)

||ఆనందించెదను||

నాకు తల్లిదండ్రి మరియు మిత్రుడాయెనే
నిందలోర్చి ఆయనను ప్రకటింతును (2)

||ఆనందించెదను||

వ్యాధి బాధలందు నేను మొర్ర పెట్టగా
ఆలకించి బాధ నుండి నన్ను రక్షించెను (2)

||ఆనందించెదను||

భువిలోని బాధలు నన్నేమి చేయును
పరలోక దీవెనకై వేచియున్నాను (2)

||ఆనందించెదను||