Naa Neethiki Aadhaaramaa

నా నీతికి ఆధారమా

నా నీతికి ఆధారమా… – నిబంధన మందసమా (2)
అనుబంధమా – మకరందమా – నాలో ఆనందమా (2)
మహనీయుడా యేసయ్యా – ఆరాధన నీకేనయ్యా (2)

|| నా నీతికి ||

1. నీ ప్రేమ నాపై – ద్వజముగా నిలిపినావు (2)
ఇమ్మానుయేలువై – అన్నీ వేళలా – ఆదుకున్నావులే (2)
అలసిన నా ఆశ – తృప్తి పరచగా (2)
అంకితమైనావులే – కృపలో దాచావులే (2)

|| మహా నీయుడా ||

2. నీ రూపు నాలో ఏర్పరచగా నెంచినావు (2)
పరమకుమ్మరివై నీ పోలికగా మలచుచున్నావులే (2)
నా శ్రమలన్నీ నీ మహిమ ఎదుట (2)
నన్ను నిలిపేనులే – నీ వలె మారెనులే (2)

|| మహా నీయుడా ||

3. నీ దృష్టి నాపై నిలిపి బోధించినావు (2)
దేవుడవై నీవు నా ముందుగా నిలిచి గెలిపించినావు (2)
అవమానించినా శత్రువు ఎదుట (2)
నన్ను ఘనపరచినావు – నా పక్షమై నిలచినావు (2)

|| మహా నీయుడా ||