Naa Naathudaa
నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు
నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు (2)
అన్నియు నీకై వీడి – నిన్నే వెంబడించితిని (2)
పెన్నుగ నాలో నాటుమా (2) ప్రేమన్
||నా నాథుడా||
దేవాలయ విగ్రహముల్ – దేవతలు వేయిలక్షల్ (2)
యావత్తు పెంటయనుచు (2) నిదిగో
||నా నాథుడా||
ఆదియంత రహితుడ – ఆత్మల నాయకుడా (2)
ఆశ కల్గించు నాలోన (2) నీవే
||నా నాథుడా||
పరిశుద్ధ యవతరుడా – మరియు తేనె అమృతుడా (2)
కరుణతో నన్ను గావుమా (2) యిప్పుడు
||నా నాథుడా||
భూతలమునకు వేంచేసి – పాతకుల ప్రేమించితివి (2)
పాతకుడ నేనైతిని (2) మహా
||నా నాథుడా||
ఆద్యంతము లేనట్టి – బీదలకు ధన నిధీ (2)
సదయుడా నన్ను చూడుమా (2) యిపుడు
||నా నాథుడా||
హల్లెలూయ గీతమును – ఎల్లెడల చాటించెదను (2)
ఉల్లమందానంద ధ్వని (2) యిదియే