Naa kshemamu Nadhivale
నా క్షేమమును నదివలే మార్చి
నా క్షేమమును నదివలే మార్చి
దిషదశల పొరలి ప్రవహింపజేసితివి యేసయ్యా (2)
అడుగుపెట్టు చోటల్లా క్షేమము ఉండునట్లు
ఉద్దేశించియున్నావు దానిని సఫలపరచుచున్నావు (2)
||నా క్షేమమును||
1. ఎన్నడు దున్నని బీడు భూములలో నేను నడచి వెళ్ళినప్పుడు
అడుగడుగున కనుగొంటిని మారా లోయల అనుభవం (2)
మారాను – మధురముగా మార్చుటకే (2)
||నా క్షేమమును||
2. దూతలు చేయలేని ఈ పరిచర్యకు నీవు నన్ను పిలిచినప్పుడు
దినదినము కనుగొంటిని కన్నీటి లోయల అనుభవం (2)
దుఃఖమును – నాట్యముగా మార్చుటకే (2)
ఆత్మల పంటనిచ్చితివి – నా ఏలినవాడవై
||నా క్షేమమును||
3. శుభప్రదం నిరీక్షణ గల ఈ పరిచర్యకు
నీవు నన్ను పిలిచినప్పుడు
అనుక్షణము కప్పినది విడువని నీ కృప అనుభవం (2)
నీ సమరుపముగా – నన్ను మార్చుటకే
నీ ఉలితో నన్ను చెక్కితివి – నా శిల్పకారునివై