Naa Hrudayamentho

నా హృదయమెంతో జీవముగల దేవుని

నా హృదయమెంతో జీవముగల దేవుని
దర్శింప ఆనందముతో కేకలేయుచున్నది (2)

నా దేహమెంతో నీకై ఆశించే (2)
శాశ్వత కృపను నేను తలంచగా
కానుక నైతిని నీ సన్నిధిలో (2)

1. భక్తిహీనులతో నివసించుట కంటెను
నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట (2)
వేయి దినాల కంటే శ్రేష్ఠమైనది (2)

||శాశ్వత కృపను||

2. సీయోను శిఖరాన సిలువ సితారతో
సింహాసనం ఎదుట క్రొత్తపాట పాడెద (2)
సీయోను రారాజువు నీవెగా (2)

||శాశ్వత కృపను||

3. నూతనమైన ఈ జీవమార్గమందున
నూతన జీవము ఆత్మాభిషేకమే (2)
నూతన సృష్టిగ నన్ను మార్చెను (2)

||శాశ్వత కృపను||

4. దూతలు చేయని నీ దివ్యసేవను
ధూళినైన నాకు చేయ కృప నిచ్చితివే (2)
ధూపార్తిని చేపట్టి చేసెద (2)

||శాశ్వత కృపను||