Naa Hrudaya Logililo
నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి
నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి
నీ ప్రేమ కౌగిలిలో నను ఓదిగిపోని (2)
నీ ఆత్మతో నను నిండని – నీ సాక్షిగా ఇలలో నన్నుండని
||నా హృదయ||
1. నా లోపల సంచరించి – నాతో భుజియించి
జీవపు మార్గము చూపించి – సరిగా నడిపించి (2)
నా జీవితం వెలిగించినావా (2)
నీ రూపమే నాలో ముద్రించినావ
||నా హృదయ||
2. బలహీనతలను హరియించి – శక్తితో దీవించి
అజ్ఞానము నిర్ములించి – సత్యము బోధించి (2)
నా భారమే భరియించినావ (2)
నీ శాంతినే నాలో స్థాపించినావ
||నా హృదయ||
3. అనురాగముతో బందించి – ఆప్యాయత పంచి
ఆనందము ననుగ్రహించి – ఆత్మీయత పెంచి (2)
నా శోకమే తొలగించినావ (2)
స్తుతి గానమే నాలో పలికించినావ