Naa guri Neeve

నా గురి నీవే నా దరి నీవే

నా గురి నీవే నా దరి నీవే
నా స్వర జరి నీవే యేసయ్యా

1. మార్పు లేని మనసే నీది
మరపురాని ప్రేమే నీది
కలనైన మెళకువనైన
మధురస్మృతి నీవేగా… హృది నిను పాడేనుగా…

॥నా గురి॥

2. బలహీనతలో బలమే నీవు
బాహుబలము చూపించేవు
ప్రియుడా నన్ను ఘనముగ చూడా
పరితంపించేవుగా.. ప్రేమానిధి నీవేగా..

॥నా గురి॥

3. శాశ్వతమైనా కృపయే నీది….
శ్రమలోనన్ను విడువగలేనిది
సుందరమైన…..సీయోనులోనా….
నిన్ను చూచేనుగా….నూతన, గీతము పాడేనుగా..

॥నా గురి॥