Mellani Challani

మెల్లని చల్లని స్వరము యేసయ్యదే

మెల్లని చల్లని స్వరము యేసయ్యదే
ఉల్లమంతటిని నింపు ఆనందము
అల్లకల్లోలము బాపి శాంతి నిచ్చుఁన్

||మెల్లని||

శూన్యము నుండి సర్వం – సృష్టి చేసెనుగా
మంచిదంతటిని మాటతో చేసెను
పాపులను పిలిచిన ప్రేమ గల స్వరము
పావనపరచెడి పరిశుద్ధుని స్వరము

||మెల్లని||

స్వస్థత శక్తి కలదు ప్రభుని స్వరమందున
దీనులను ఆదరించు దివ్య కరుణ స్వరం
కుళ్ళిన శవమునందు జీవమును పోసెను
పునరుత్తాన బలం కలదు ఆ స్వరములో

||మెల్లని||

గాలి తుఫానులన్ అణచిన స్వరమది
భీతి భయములన్ని బాపెడి స్వరమది
అంత్య దినమందున మృతుల లేపునుగా
అందరికి తీర్పును తీర్చి పాలించును

||మెల్లని||

మహిమ గల ఆ స్వరం పిలుచుచుండె నిన్ను
మహిమ నాథుండేసు కోరుచుండె నిన్ను
మహిమ గల ఆ స్వరం వినెడి చెవులున్నావా
మహిమ నాథుండేసున్ కోరు హృది ఉన్నదా

||మెల్లని||