Marachithivela

మరచితివేల నీ మొదటి ప్రేమను

మరచితివేల నీ మొదటి ప్రేమను
విడచితివేల నీ విశ్వాసమును (2)
యోచించు సోదరా, యోచించు సోదరి
నాగటి పై చేయి పెట్టి వెనుతిరిగేదవా (2)

||మరచితివేల||

1. ప్రభువే సర్వమని పలికితివి నీవు
ప్రాణమైన అర్పించెద అంటివి ఆనాడు (2)
చులకనాయేనా క్రీస్తు ప్రేమ ఈనాడు (2)
మోసపోకుమా దేవుడు వెక్కిరించబడడు (2)

||యోచించు||మరచితివేల||

2. మనజులెల్ల మరచిన మరువని నీ దేవుడు
మరణము పైబడినను తప్పించను కాదా (2)
రక్షణ నిర్లక్ష్య పెట్టి లోకముకై పరుగేలా (2)
ప్రభువు చేయి విడిచిన నీ గతి ఏమౌను (2)

||యోచించు||మరచితివేల||

3. లోకము దాని ఆశయు గతించి పోవును
ప్రభువు చిత్తం నెరవేర్చిన నిలిచెదవు నీవు (2)
మొదటి ప్రేమ రగిలించి మారు మనసు పొందుము (2)
లేనియెడల లోకమే నిన్ను కాల్చి వేయను (2)

||యోచించు||మరచితివేల||