Manchimanasunna Chelli
మంచిమనస్సున్న చెల్లి
మంచిమనస్సున్న చెల్లి మాట వినవె నా తల్లి
యేసుపై నిలుపు నీ గురి ఆ… ఆ…
వర్ధిల్లునమ్మా నీదారి ఆ…ఆ…
॥మంచి॥
1. లోకములో మనుషుల ప్రేమ శాశ్వతము కాదమ్మా
అవసరమున్నంత వరకే అనురాగం చూపేరమ్మా
అందరు ఎడబాసినా నిన్ను విడిచిపోడమ్మా
అలసిన నీ మనసునకు సేద తీర్చునోయమ్మా
నమ్మమ్మా నా చెల్లెమ్మా ఈ మాటను
నిజమెరిగి నడువమ్మా ఈ బాటను
॥మంచి॥
2. మాయలోక ఛాయలు చూచి మైమరచిపోయేవమ్మా
వ్యర్ధమైన దానికోసం ఆరాటం ఎందాకమ్మా
ఎండమావి నీరు దాహం తీర్చలేదు ఓ చెల్లెమ్మా
ఎడారైన బ్రతుకులలోన జీవజలం యేసేనమ్మా