Manakai yesu maraninche

మనకై యేసు మరణించె మన పాపముల కొరకై

పల్లవి: మనకై యేసు మరణించె మన పాపముల కొరకై

నిత్యజీవితము నిచ్చుటకే సత్యుండు సజీవుడాయె(2)

1. తృణీకరింపబడె విసర్జింపబడెను(2)
దుఃఖా క్రాంతుడాయె వ్యసనముల భరించెను
(2)

౹౹మనకై౹౹

2. మన వ్యసనముల వహించెన్ – మన దుఃఖముల భరించెన్(2)
మన మెన్నిక చేయకయే – మన ముఖముల ద్రిప్పితిమి(2)

౹౹మనకై౹౹

3. మన యతిక్రమముల కొరకు – మన దోషముల కొరకు(2)
మన నాథుడు శిక్షనొందె – మనకు స్వస్థత కలిగె(2)

౹౹మనకై౹౹

4. గొర్రెలవలె తప్పితిమి – పరుగిడితిమి మనదారిన్(2)
అరుదెంచె కాపరియై – అర్పించి ప్రాణమును
(2)

౹౹మనకై౹౹

5. దౌర్జన్యము నొందెను – బాధింపబడెను(2)
తననోరు తెరువలేదు – మనకై క్రయధనమీయన్(2)

౹౹మనకై౹౹

6. ఎదిరింప లేదెవరిన్ – లేదే కపటము నోట(2)
యెహోవా నలుగగొట్టెన్ – మహావ్యాధిని కలిగించెన్

౹౹మనకై౹౹

7. సిలువలో వ్రేలాడెన్ – సమాధిలో నుండెను(2)
సజీవుండై లేచెన్ – స్తోత్రము హల్లెలూయ

౹౹మనకై౹౹