Mahimonnathydu

మహిమోన్నతుడు మహిమాన్వితుడు

మహిమోన్నతుడు మహిమాన్వితుడు – మరణము గెల్చిన మృత్యుంజయుడు
అద్వితీయుడు అతి సుందరుడు – అధిక జ్ఞాన సంపన్నుడు (2)
ఆరాధన… ఆరాధన… ప్రభు యేసు క్రీస్తుకే ఆరాధన
హల్లెలుయ…. హల్లెలుయ…. రాజులరాజుకే హల్లెలుయ (2)

||మహి||

1. సర్వము నెరిగిన సర్వాధికారి – సర్వము చేసిన సర్వోపకారి (2)
నీతిమంతుని ప్రేమించువాడు – ఇశ్రాయేలును కాపాడువాడు (2)

||ఆరా||

2. నిత్యము వసియించు అమరుడు ఆయనె – మార్గము సత్యము జీవము ఆయనె
నమ్మిన వారిని రక్షించువాడు – నిత్య జీవము దయచేయువాడు (2)

||ఆరా||