Maate Chalayya Yesayya
మాటే చాలయ్యా యేసయ్యా
మాటే చాలయ్యా యేసయ్యా – నీ మనసే చాలయ్యా యేసయ్యా (2)
మనసారా నిను పాడ – మదినిండా నిను వేడ (2)
నేను జీవిస్తా నీకోసం నా యేసయ్యా
హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధన – మనసంతా నీకోసం యీ ఆలాపన (2)
|| మాటే చాలయ్యా ||
1. లోకమే విషమై విషమే వశమై – కలతై నలతై నను వేధించగా
మరణమే వరమై వరమే వశమై – అలుసై నలుసై నను బాధించగా (2)
దిక్కులేని దానను దరికి నిలిచి – దారిలేని దానను మార్గమై నిలచి (2)
|| నేను జీవిస్తా ||
2. దయగల దేవా నా దీపమును – వెలిగించితివా యీ చీకటిలో
పారవేయకుండా త్రోసివేయకుండా – విడిపించితివా నను బంధకాలలో (2)
నా కాలగతులలో నీ కృప నాపై – విస్తరింపజేశావు విడుదలనిచ్చి (2)
నను ప్రేమతో పిలిచినావయా – నా పాపమంత బాపినావయా (2)