Lemmu Tejarillumu Neevu

లెమ్ము తేజరిల్లుము నీవు

లెమ్ము తేజరిల్లుము నీవు – వెలుగు నీకు వచ్చియున్నది
కుమ్ముకున్న చీకటులన్ని – తొలగిపోవు సమయమైనది
సడలిన మోకాళ్ళును బలపరచుము
వడలిన నీ చేతులను కదిలించుము

॥ లెమ్ము||

1. కృంగిపడిన దినములనే చాలించాలి
ఓటమినే త్రోసి గెలుపు సాధించాలి
లోకాశల యేటికి నువ్వు ఎదురీదాలి
లోకంలో ప్రభుజ్యోతిగా నువ్వు వెలగాలి

॥ లెమ్ము||

2. సత్యవాక్య ఖడ్గమునే ధరించాలి
ప్రార్ధన బలిపీఠాన్ని మండించాలి
అపవాది కోటలను నువ్వు కూల్చాలి
విశ్వాస ఫలమెంతో చూపించాలి.

॥ లెమ్ము||