Kuthuhalam aarbaatame
కుతూహలం ఆర్భాటమే
కుతూహలం ఆర్భాటమే – నా యేసుని సన్నిధిలో
ఆనందమానందమే – నా యేసుని సన్నిధిలో (2)
||కుతూహలం||
పాపమంత పోయెను – రోగమంత పోయెను యేసుని రక్తములో
క్రీస్తునందు జీవితం – కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో (2)
||కుతూహలం||
దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించు దేవాలయం మనమే
ఆత్మయైన దేవుడు – మన సొంతమాయెను ఆశ్చర్యమాశ్చర్యమే (2)
||కుతూహలం||
శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసు జయంపై జయం ఇచ్చును
ఏకముగా కూడి – హోసన్నా పాడి ఊరంతా చాటెదము (2)