Kuthoohalam Aarbhaatame

కుతూహలం ఆర్భాటమే

కుతూహలం ఆర్భాటమే – నా యేసుని సన్నిధిలో
ఆనందమానందమే – నా యేసుని సన్నిధిలో (2)

||కుతూహలం||

పాపమంత పోయెను – రోగమంత పోయెను
యేసుని రక్తములో
క్రీస్తునందు జీవితం – కృప ద్వారా రక్షణ
పరిశుద్ధ ఆత్మలో (2)                 

||కుతూహలం ||

దేవాది దేవుడు – ప్రతిరోజు నివసించు
దేవాలయం మనమే
ఆత్మయైన దేవుడు – మన సొంతమాయెను
ఆశ్చర్యమాశ్చర్యమే (2)              

||కుతూహలం||

శక్తినిచ్చు యేసు – జీవమిచ్చు యేసు
జయంపై జయం ఇచ్చును
ఏకముగా కూడి – హోసన్నా పాడి
ఊరంతా చాటెదము (2)                     

||కుతూహలం||