Kudikoni yonnamu
కూడికొని యున్నాము - సంఘ ప్రభో
కూడికొని యున్నాము – సంఘ ప్రభో – కూడికొని యున్నాము = తోడ నుండెద ననుచు నమ్ముచు – దొడ్డ దగు నీ పాద సన్నిధి
|| కూడికొని ||
1. ఎచట నా ప్రియ భక్తు – లెలమిఁ గూడియున్న నచటికి నేతెంతు – నని పల్కితి = విచట నుండు మమ్ము – వీక్షించి కృపచేత – నిపుడు దీవించు మీ – యేసు క్రీస్తునాధా
|| కూడికొని ||
2. గత కాలమందున – గాని చేఁతలచే దు – ర్గతి నొంది యుండఁగాఁ – గనుఁగొంటివి = శత సంఖ్య గల పాప – చయ మీవు క్షమియించి – యతి శాంతి నిడితివి – యాత్మ స్వరూపా
|| కూడికొని ||
3. నిరతము నీ ప్రేమ – నెనరున ధ్యానించి – పరమ ధర్మములందుఁ – బరతఁ గల్గి = యరులకు శుభములు – నిరతంబుఁ జేయఁగఁ – దిరత మా కొసఁగు ము – దేవుని ప్రియ తనయా
|| కూడికొని ||
4. అన్ని శోధనముల నన్ని విపత్తుల – నన్ని కాలములందు – నాదరించి నిన్ను నమ్మిన జనుల – నీ సందిటను జేర్చి – పన్నుగఁ గాపాడు ప్రభు యేసు క్రీస్తు
|| కూడికొని ||
5. అమలుఁడ నగు న – న్న నుకరించుం డనుచు – నాన తిచ్చినాఁడ – వాత్మ జులకు = నమల మార్గము నందు – నరుగంగ మాకీవు – విమలాత్మ దయ సేయు – వేగంబు మా తండ్రీ
|| కూడికొని ||