Krupalanu Thalapoyinchu

కృపలను తలపోయుచు

కృపలను తలపోయుచు నీ సన్నుతినే చేయనా
శాంతి ప్రదాతవు నీవని (2) సంకీర్తన సేయనా

||కృపలను||

1. అందరిలోన ఘనుడవు నీవని
ఆదిలో వాక్యపు నాదమె నీవని
అందరి కోసం బలియైనవాడవని
త్యాగము నే చాటనా నీ సిలువ
యాగము నే చాటనా – యేసయ్యా

||కృపలను||

2. వేదనలోన నెమ్మదినీవని
శోధన బాపే నాధుడ నీవని
అంతము వరకు నడిపించు వాడవని
చరణములే వేడనా నీ పాద
సన్నిధి నే చేరనా – యేసయ్యా

||కృపలను||