Koyabadina Gaayamu

కోయబడిన గాయము

కోయబడిన గాయము – కొట్టబడిన కాయము
రక్తము రక్తము – రక్తధారల ప్రభావము
ఏకైక హస్తము పొడవబడిన హస్తము
మాన్పును నూన్పును మాన్ప గల్గు పాపిగాయము

1. వేధనలు గుండెలలో బాధింపగా రోదనతో కన్నీరు
ప్రవహింపగా – ఒక హృదయమే-యేసు హృదయము
గ్రహింపగల్గు పాపభారము

॥కోయ॥

2. పశ్చాత్తాపులు విలపింపగా-పాపపుడాగులు పోగొట్టగా
ప్రవాహమే రక్త ప్రవాహమే-అది మాత్రమే శద్ధీకరించును
3. యేసుని రక్తమే శుద్ధిచేయు రక్తమే విమోచన చేయును
మన భారము భరియించును-మనకు సంతోషమీయగలడు
4. పైకెత్తు ప్రభువా నీ రుధిర హస్తము-విడదీయ శుద్ధీకరణ
బంధం పాపము నుండి మా కేదాశ్రయం
గాయంపు ప్రక్కేగాదా శరణ్యం

॥కోయ॥