Kondala Thattu

కొండల తట్టు కన్నులెత్తుచున్నాను

కొండల తట్టు కన్నులెత్తుచున్నాను
నాకు సాయమెచ్చట నుండి వచ్చును

భూమి యాకాశముల సృజించిన
యెహోవా వలన సాయము కల్గున్

||కొండల||

నీ పాదము తొట్రిల్ల నీయడు
నిన్ను కాపాడువాడు కునుకడు

||కొండల||

ఇశ్రాయేలును కాచు దేవుడు
కునుకడు నిద్రపోడు యెన్నడు

||కొండల||

యెహోవాయే నిన్ను కాపాడును
కుడి ప్రక్క నీడగా నుండును

||కొండల||

పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ
నీకు తగులకుండ కాపాడును

||కొండల||

ఎట్టి అపాయమైన రాకుండ
ఆయన నీ ప్రాణము కాపాడున్

||కొండల||

ఇది మొదలుకొని నిత్యము నీ
రాకపోకలందు నిను కాపాడున్

||కొండల||