Kanneeti Loyalalo

కన్నీటి లోయలలో

కన్నీటి లోయలలో – నేనెంతో కృంగిననూ
కన్నీరు చూచువాడు – కార్యము జరిగించును (2)
నీ మనసు కదలకుండా – నీ మనసు కృంగకుండా
నీతోనే ఎల్లప్పుడూ – నేనుందున్ అంతం వరకు (2)

|| కన్నీటి ||

చీకటి బాటయైనా – భయంకర శోధన
కలువున్ ఆ వేళలో – సిలువ నీడ నీకై (2)

||నీ మనసు||

ఎర్ర సముద్ర తీరం – మొర్రలిడిన్ తన దాసులు
గుండెల్లో దాగి ఉన్న – గొప్ప బాధ తొలగెన్ (2)

||నీ మనసు||

ఎంత కాలం వేచి ఉండాలి – నాథా నీ రాకడకై
శ్రమలు తీరుటకు – ఎంతో కాలం లేదు (2)

||నీ మనసు||