Kalyanam Kamaneeyam

కళ్యాణం కమనీయం

కళ్యాణం కమనీయం – ఈ సమయం అతి మధురమ్
దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా (2)

|| కళ్యాణం||

1. ఏదేను వనమున యెహోవ దేవా – మొదటి వివాహము చేసితివి
ఈ శుభ దినమున నవ దంపతులను (2)
నీ దీవెనలతో నింపుమయా

||దేవా||

2. కానా విందులో అక్కరనెరిగి – నీళ్ళను రసముగ మార్చితివే
కష్టములలో నీవే అండగ ఉండి (2)
కొరతలు తీర్చి నడుపుమయా

||దేవా||

3. బుద్ధియు జ్ఞానము సంపదలన్నియు – గుప్తమై యున్నవి నీయందే
ఇహపరముల సుఖములు మెండుగ నొసగి (2)
ఇల వర్ధిల్లగ చేయుమయా

||దేవా||