Kallu Theristhe Velugura

కళ్లు తెరిస్తే వెలుగురా

కళ్లు తెరిస్తే వెలుగురా
కళ్ళు మూస్తే చీకటిరా
నోరు తెరిస్తే శబ్దమురా
నోరు ముస్తే నిశ్శబ్దమురా

ఏ క్షణమో తెలియదు జీవిత ఆంతం
ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం

||కళ్లు||

1.ఊయల ఊగితే జోల పాటరా
ఊయల ఆగితే ఎడుపు పాటరా (2)
ఊపిరి ఆడితే ఉగిసలాటరా
ఊపిరి ఆగితే సమాధి తోటరా

||ఏక్షణమో||

2.బంగారు ఊయల ఊగిననీవు
భూజములపై నిన్ను మోయక తప్పదురా
పట్టు పరపుపైన పోర్లిన నీవు
మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా

||ఏక్షణమో||