Kaapaade Devudu

కాపాడే దేవుడు యేసయ్యా

కాపాడే దేవుడు యేసయ్యా
కరుణించే రక్షకుడేసయ్యా
మనసు మార్చు దేవుడు యేసయ్యా
నిత్య జీవ మార్గం యేసయ్యా (2)
ఓరన్నో వినరన్నా – ఓరన్నో కనరన్నా
ఓరయ్యో వినరయ్యా – ఓరయ్యో కనరయ్యా

||కాపాడే||

మనుష్యులను నమ్మొద్దనెను
మంచి మాటలు పలికెదరనెను (2)
మోసం చేసే మనుష్యులకంటే
మంచి దేవుడు యేసే మిన్నన్నా
మోక్షమిచ్చుఁ యేసే గొప్పని
తెలుసుకుంటే మంచిది ఓరన్నా

|| ఓరన్నో ||

నిన్ను విడువనన్నాడు
ఎడబాయను అన్నాడు (2)
దిగులు చెంది కలత చెందకు
నీ అభయం నేనే అన్నాడు (2)

|| ఓరన్నో ||