Kaalam Samayam
కాలం సమయం నాదేనంటూ
కాలం సమయం నాదేనంటూ
అనుకుంటున్నావా రోజులన్నీ నావే నంటూ జీవిస్తున్నావా (2)
దేవుని ముందు నిలిచే రోజుంది
దేవునికి బదులిచ్చే రోజుంధి
నీ లెక్కనప్పజెప్పే రోజుంది
నీ తక్కెడ తూకం వేసే రోజుంది
ఆగవేమయ్యా ఈ మాట వినవయ్య
నీ గుండె తలుపులు తెరచి యేసుని పిలుచుకోవయ్యా…(2)
||కాలం||
జరుగుచున్న రోజులు కావు నీవి కావు
దానంగా దేవుడు నీకు ఇచ్చినట్టి ఈవి (2)
వడివడిగా రోజులు పరుగెడుతున్నాయి(2)
తరునాలు చేజారుతున్నాయి (2)
||ఆగవెమయ్యా||
చూసావా భూకంపాలు కరువులు విపరీతాలు
పరిశుద్ధ గ్రంథములోని కడవరి కాలపు సూచనలు (2)
నిన్నటి వరకు కొరతే లేదని అన్నారు (2)
ఒక్క ఘడియలో ఎందరో బికారులయ్యారు (2)
||ఆగవెమయ్యా||కాలం||
సిద్ధపడిన వారి కోసం పరలోకపు ద్వారాలు
తెరచియున్న తలుపులు నీకు పలుకు స్వాగతాలు (2)
సిద్దపాటు లేని వారికి నరకపు ద్వారాలు (2)
మండే అగ్ని గుండెకు వేదన వేదన నిలయాలు (2)