Jananee O mariya challani

జననీ ఓ మరియా.. చల్లని మాతవమ్మా ..

జననీ ఓ మరియా.. చల్లని మాతవమ్మా ..

జీవిత యానములో – మాతోడుగా నిలువుమమ్మా .. (2)

|| జననీ||

శుభములు గూర్చు నీనామం – నిరతము నాలో స్మరియించూ (2)

మధురము నీ ప్రేమా .. – ఎడబాయని నీ కరుణా (2)

|| జననీ||

వెన్నెల వంటి నీ మమతా – సుధలను నాలో కురిపించూ..(2)

స్వర్గమే నీ హృదయం – కమనీయమే నీ వదనం (2)

|| జననీ||

ఆశలు తీర్చు నీ జపము – ఆపదలో మా స్థిరచరణం (2)

చరగదు ఈ బంధం – విడిపోని అనుబందం (2)

|| జననీ||